telugu navyamedia
సినిమా వార్తలు

విజయనిర్మల అంత్యక్రియలు పూర్తి

సూపర్‌స్టార్‌ కృష్ణ సతీమణి, సీనియర్‌ నటి, దర్శకురాలు, నిర్మాత విజయనిర్మల భౌతికంగా అందరికీ దూరమయ్యారు. ఆమెకు కుటుంబ సభ్యులు, అభిమానులు కన్నీటి వీడ్కోలు పలికారు. కొద్ది సేప‌టి క్రితం మొయినాబాద్ మండ‌లం చిలుకూరులోని విజయకృష్ణా గార్డెన్స్‌‌లో విజ‌య నిర్మ‌ల అంత్య‌క్రియ‌లు పూర్తి చేశారు. విజ‌య నిర్మ‌ల కొడుకు నరేష్ ఆమె చితికి నిప్పంటించారు. విజ‌య నిర్మ‌ల‌ని క‌డ‌సారి చూసేందుకు సినీ ప్ర‌ముఖుల‌తో పాటు అభిమానులు ఫాంహౌస్‌కి భారీగా త‌ర‌లి వ‌చ్చారు. బుధవారం అర్థరాత్రి చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన విజయనిర్మలను గురువారం అభిమానుల సందర్శనార్థం నానక్‌రామ్‌గూడలోని స్వగృహంలో ఉంచారు. నేడు విజయకృష్ణ గార్డెన్స్‌లో అంత్యక్రియలు నిర్వహించారు.

Related posts