ఐపీఎల్ 2020లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను గాయాల బెడద వీడడం లేదు. లీగ్ తొలి మ్యాచ్‌లోనే స్టార్ ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ గాయం బారినపడి టోర్నీ మొత్తంకు దూరమయిన విషయం తెలిసిందే. రెండో మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తూ మనీశ్ పాండే గాయపడ్డాడు. అయితే అతడు త్వరగానే కోలుకున్నాడు. స్టార్ బ్యాట్స్‌మన్ కేన్ విలియమ్సన్ కూడా గాయం కారణంగా రెండు మ్యాచులకు దూరమయ్యాడు. ఆపై స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్ గాయం కారణంగా లీగ్ నుంచి తప్పుకున్నాడు. తాజాగా ఎస్‌ఆర్‌హెచ్‌కు మరోదెబ్బ తగిలింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బౌలింగ్ చేస్తుండగా గాయపడిన ఆల్‌రౌండర్ విజయ్ శంకర్ ఐపీఎల్ 2020 నుంచి వైదొలిగాడు. హ్యామ్‌స్ట్రింగ్ ఇంజ్యూరీ కారణంగా విజయ్ ఐపీఎల్ నుంచి తప్పుకున్నాడు. ఇలాంటి కీలక సమయంలో జట్టుకు విజయ్ దూరమవడం ఎస్‌ఆర్‌హెచ్‌కు భారీ ఎదురుదెబ్బే.
మంగళవారం రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇన్నింగ్స్ విజయ్ శంకర్ గాయపడ్డాడు. 10వ ఓవర్ బౌలింగ్ చేసిన విజయ్ 7 పరుగులు ఇచ్చాడు. 12వ మూడో బంతికి ఢిల్లీ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్‌ను ఔట్ చేశాడు. ఐదో బంతి అనంతరం అతడు గాయపడ్డాడు. ఎడమ కాలి తొడ కండరం పట్టేయడంతో మరో బంతి వేయకుండానే శంకర్ మైదానాన్ని వీడాడు. దీంతో వార్నర్ చివరి బంతిని పూర్తి చేశాడు. ఈ సీజన్లో 7 మ్యాచ్‌లు ఆడిన విజయ్ శంకర్ 97 పరుగులు చేశాడు. ఢిల్లీతోనే జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలో దిగిన వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా బ్యాటింగ్ చేస్తూ గాయపడ్డాడు. ఆపై మైదానంలోకి రాలేదు. దీంతో ఆ మ్యాచ్‌లో సాహా బదులు శ్రీవాత్స్ గోస్వామి వికెట్ కీపింగ్ చేశాడు. కానీ సాహా కోలుకున్నాడని తెలుస్తోంది.