telugu navyamedia
సినిమా వార్తలు

విజయ్ సేతుపతి ‘లాభం’ ఎప్పుడంటే..

విజయ్ సేతుపతి , శ్రుతిహాసన్ జంటగా తమిళంలో ‘లాభం’ సినిమా రూపొందింది. ఎస్.పి.జననాథన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు తెలుగులో ‘లాభం’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. విభిన్నమైన కథాకథనాలతో రూపొందిన ఈ చిత్రంలో జగపతిబాబు, సాయి ధన్సిక ప్రధాన పాత్రలు పోషించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం వినాయకచవితి సందర్భంగా ఈ రెండు భాషల్లోను ఈ సినిమాను సెప్టెంబర్ 9వ తేదీన విడుదల చేయనున్నారు.

శ్రీ గాయత్రీ దేవి ఫిలిమ్స్ పతాకంపై నిర్మాత బత్తుల సత్యనారాయణ ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు. ఈ చిత్రానికి లాయర్ శ్రీరామ్ సమర్పణ. హరీష్ బాబు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. ఇమాన్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

Tamil Movies on Twitter: "Interesting Photos from #Sindhubaadh https://t.co/HG4OmQZxWp… "

ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ… ‘విజయ్ సేతుపతి, శ్రుతిహాసన్ జంటగా నటించిన “లాభం” చిత్రం సెప్టెంబర్ 9న తెలుగు, తమిళంలో ఏకకాలంలో విడుదల అవుతోంది. ఇలా రెండు భాషల్లో మొదటిసారి విజయ్ సేతుపతి చిత్రం విడుదలకావడం విశేషం. మాస్టర్, ఉప్పెన తరువాత విజయ్ సేతుపతి నటించిన పక్కా కమర్షియల్ చిత్రం ఇది. తప్పకుండా ప్రేక్షకులను మెప్పిస్తుంది. విజయ్ సేతుపతి చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నందుకు గర్వంగా ఉంది ‘ అన్నారు.

Related posts