telugu navyamedia
రాజకీయ

విజయ్‌ మాల్యాకు సుప్రీం కోర్టు షాక్‌ : జైలు శిక్ష, జరిమానా

*విజయ్‌ మాల్యాకు నాలుగు నెల‌లు జైలు శిక్ష‌
*కోర్టు ధిక్క‌ర‌ణ కేసు సుప్రీం తీర్పు

వ్యాపారవేత్త విజయ్‌ మాల్యాకు కోర్టు ధిక్కారణ కేసు కింద సుప్రీం కోర్టు షాక్‌ ఇచ్చింది.
రూ.9 వేల కోట్ల మేర బ్యాంకు రుణాలు ఎగవేసి విదేశాలకు పరారైన మాల్యాకు కోర్టు ధిక్కార కేసులో నాలుగు నెలల నెలల జైలు శిక్ష విధించింది. రూ. 2వేల జరిమానా కూడా విధించింది.

అలాగే కుటుంబానికి అక్రమంగా తరలించిన 40 మిలియన్ల డాలర్ల సొమ్మును తిరిగివ్వాలని మాల్యా కుటుంబ సభ్యులను సుప్రీంకోర్టు ఆదేశించింది.

ఈ మేరకు న్యాయమూర్తులు యు.యు లలిత్, ఎస్ రవీంద్ర భట్, నేతృత్వంలోని ధర్మాసనం శిక్షను ఖరారు చేసింది. 

2017లో క‌ర్ణాట‌క హైకోర్టు ఆదేశాల‌ను ఉల్లంఘించి విదేశాల్లో ఉన్న త‌న కుమారుడు సిద్ధార్థ్ మాల్యా, కుమార్తెలు లియానా మాల్యా, తాన్యా మాల్యాల‌కు 40 మిలియ‌న్ డాల‌ర్లను ఎస్‌బీఐ బ్యాంక్ నుంచి మాల్యా బ‌దిలీ చేశారు.

నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా న‌గ‌దు బ‌దిలీ చేశార‌ని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ విషయాన్ని కోర్టు వద్ద దాచినట్లు సుప్రీం కోర్టు తేల్చింది.

ఈ క్రమంలోనే అతనికి శిక్షను విధించిన ధర్మాసనం.. నాలుగు వారాల్లోగా కోర్టులో 40 మిలియన్ డాలర్లు(సుమారు రూ.317 కోట్లు) , సంవత్సరానికి 8 శాతం వడ్డీతో పాటు జమ చేయాలని మాల్యాను ఆదేశించింది. అలా జరగని పక్షంలో ఆస్తుల అటాచ్‌మెంట్ ప్రక్రియ ప్రారంభమవుతుందని కోర్టు పేర్కొంది.ప్రస్తుతం మాల్యా.. విదేశాల్లో తలదాచుకుంటున్నారు.

 

Related posts