telugu navyamedia
సినిమా వార్తలు

అదిరిపోయిన ఛాయ్ వాలా “లైగర్” ఫస్ట్ గ్లింప్స్ ..

రౌడీ బాయ్, అమ్మాయిల క్ర‌ష్ హీరో.. విజయ్​ దేవరకొండ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘లైగర్’. డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో విజయ్​కు జోడీగా అనన్యా పాండే నటిస్తోంది. లెజెండరీ బాక్సర్ మైక్ టైసన్ కీలక పాత్ర పోషిస్తున్నారు.

Vijay Deverakonda's Liger first glimpse packs a punch. Watch new promo -  Movies News

తాజాగా న్యూ ఇయర్ 2022 కానుకగా లైగర్ ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేశారు. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా లైగర్ గ్లింప్స్ వదిలి రౌడీ హీరో విజయ్ దేవరకొండ అభిమానుల్లో పుల్‌ జోష్ నింపారు.

ఇందులో విజయ్ బాక్సర్‌గా కనివిందు చేస్తున్నాడు.. ‘వి ఆర్ ఇండియన్స్’ అంటూ విజయ్​ దేవరకొండ ఆటిట్యూడ్​ డైలాగ్​తో అదరగొట్టాడు. ముంబై లో స్లమ్​ ప్రాంతంలోని ‘ఛాయ్​వాలా’ గా జీవనం సాగించే వ్యక్తి బాక్సర్​గా విజయ్ ఎలా ఎదిగాడనే స్టోరీ చూపించారు గ్లింప్స్​ను విడుదల చేసింది చిత్ర యూనిట్.

Liger first glimpse: Vijay Deverakonda is the 'slumdog of Mumbai', Ananya  Panday missing. Watch - PakkiKhabar

పూరీ మార్క్ యాక్షన్ సన్నివేశాలతో రౌడీ బాయ్ పవర్ ఫుల్ డైలాగ్స్, దానికి తగ్గట్టుగా ఉన్న బాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమాపై హైప్ ని పెంచేస్తోంది. అంతేకాకుండా మైక్ టైసన్ పాత్ర చాలా కీలకంగా ఉంటుందట. సినిమా కథను ఆయన పాత్రే మలుపు తిప్పుతుందని అంటున్నారు.

Liger' first glimpse VIDEO: Vijay Deverakonda delivers jaw-dropping  performance as MMA champion

ఈ చిత్రాన్ని పూరీ జగన్నాథ్ రూ. 125 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ఛార్మి, పూరీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో రమ్య కృష్ణ, రోనిత్ రాయ్, మకరంద్ దేశ్‌పాండే కూడా ప్రముఖ పాత్రల్లో నటించారు. మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంగా  తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో వచ్చే ఏడాది ఆగస్ట్ 25న ఈ పాన్ ఇండియన్ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.

Related posts