telugu navyamedia
సినిమా వార్తలు

“కబీర్ సింగ్”పై “అర్జున్ రెడ్డి” కామెంట్స్

Vijay-Devarakonda

“అర్జున్ రెడ్డి” సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా ఎదిగిపోయాడు విజ‌య్ దేవ‌ర‌కొండ. ఈ సినిమాతో ఒక్కసారిగా విజయ్ దేవరకొండ ఫేట్ మారిపోవడమే కాకుండా యూత్ లో విపరీతమైన క్రేజ్ ను దక్కించుకున్నాడు. ఆ సినిమా ప్ర‌స్తుతం హిందీలోకి “క‌బీర్ సింగ్‌”గా రీమేక్ అవుతోంది. మాతృకను రూపొందించిన సందీప్ వంగా ఈ రీమేక్‌కు కూడా డైరెక్ట‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. షాహిద్ క‌పూర్‌, కియారా ఆడ్వాణీ హీరోహీరోయిన్లుగా న‌టించారు. తాజాగా ఈ సినిమా గురించి ఒరిజిన‌ల్‌లో న‌టించి మెప్పించిన విజ‌య్ దేవ‌ర‌కొండ మాట్లాడాడు. “క‌బీర్ సింగ్‌” ఖచ్చితంగా బ్లాక్‌బ‌స్టర్‌గా నిలుస్తుంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేశాడు. “హిందీ రీమేక్‌ను కూడా నా స్నేహితుడు సందీపే రూపొందిస్తున్నారు. ఆ సినిమా కూడా క‌చ్చితంగా బ్లాక్‌బస్ట‌ర్ హిట్‌గా నిలుస్తుంది. షాహిద్ మంచి న‌టుడు. ఇప్పుడు “క‌బీర్ సింగ్‌”లోనూ ఆయ‌న అద్భుత న‌ట‌న‌ను ప్ర‌ద‌ర్శించి ఉంటారు. “క‌బీర్ సింగ్‌” కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నాను” అని విజ‌య్ అన్నాడు.

Related posts