telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అప్పుడు విజయ్ దేవరకొండపై విమర్శలు… మరి అనసూయ ఇప్పుడేమంటుందో…!?

Anasuya-bharadwaj tollywood

హీరోగా అద‌ర‌గొట్టిన విజ‌య్ దేవ‌ర‌కొండ తొలిసారి నిర్మాత‌గా మారి “మీకు మాత్ర‌మే చెప్తా” అనే సినిమాని నిర్మిస్తున్న సంగ‌తి తెలిసిందే. ష‌మీర్ అనే కొత్త ద‌ర్శ‌కుడు ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తుండగా, ఇందులో పెళ్లి చూపులు డైరెక్ట‌ర్ తరుణ్ భాస్కర్ ప్ర‌ధాన పాత్ర పోషిస్తున్నాడు. అవంతికా మిశ్రా క‌థానాయిక‌గా న‌టిస్తుంది. అభినవ్ గోమటం, నవీన్ జార్జ్ థామస్, అనసూయ, వాణి భోజన్, పావని గంగిరెడ్డి కీలక పాత్రల్లో నటించారు. సినిమాను నవంబర్ 1న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఈ క్ర‌మంలో మూవీ ట్రైల‌ర్‌ని ఈ రోజు సాయంత్రం 6.02ని.ల‌కి మ‌హేష్ బాబు విడుద‌ల చేయ‌నున్నారు. కాగా బుల్లితెరపై హాట్ యాంకర్ గా జోరును కొనసాగిస్తున్న యాంకర్ అనసూయ సినిమాలలో కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. రంగస్థలం వంటి బ్లాక్ బాస్టర్ సినిమాలో రంగమ్మత్త గెటప్ లో అదరగొట్టింది. ఆ తరువాత వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంది. అలా ఒక్కో సినిమాలో నటిస్తూ మంచి పేరును పాపులారిటీని సంపాదించుకుంది. ప్రస్తుతం ఆమె ‘మీకు మాత్రమే చెప్తా’ సినిమాలో ముఖ్య పాత్ర పోషించారు. సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ నిర్మిస్తోన్న ఈ సినిమాలో ‘పెళ్ళి చూపులు’ దర్శకుడు తరుణ్ భాస్కర్ హీరోగా నటించారు. ఆ సినిమా ప్రమోషన్స్ మొదలు పెట్టారు ఆ చిత్ర యూనిట్. ఆ కార్య క్రమంలో అను బేబీ విజయ్ గురించి ఏమని చెప్తుందో వినాలని విజయ్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ పై విమర్శలు గుప్పించిన ఇప్పుడు ఎలా రెస్పాండ్ అవుతుందో చూడాలని అనుకుంటున్నారు.

Related posts