telugu navyamedia
సినిమా వార్తలు

వాడెవడి కోసమో నేను పెళ్ళి చేసుకోవాలా ? : విజయ్ దేవరకొండ

Vijay Devarakonda

టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ నిన్న పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ ఏడాదితో విజయ్ కు ముప్పై ఏళ్లు వచ్చాయి. దీంతో అతడి పెళ్లి టాపిక్ తెరపైకి వచ్చింది. ప్రస్తుతానికైతే విజయ్ కి పెళ్లి ఆలోచన లేదట. కానీ తన తల్లి మరో రెండేళ్లలో పెళ్లి చేసుకొని, పిల్లల్ని కను అంటూ అతడిపై ప్రెషర్ పెడుతుందట. దీనిపై స్పదించిన విజయ్ ”వాడెవడికోసమో నేను పెళ్లి చేసుకోవాలా..? వాడెవడో ఎప్పుడో వస్తాడని ఇప్పుడు నేను పెళ్లి చేసుకోవాలా…? అనిపించింది నాకు” అంటూ చెప్పుకొచ్చాడు. అయితే తాను ప్రేమ వివాహమే చేసుకుంటానని, మైండ్ లో కొందరు ఉన్నారని చెప్పాడు. “ఫారెన్ అమ్మాయితో డేటింగ్ లో ఉన్నారా…?” అనే ప్రశ్నకు “మే బీ” అంటూ బదులిచ్చాడు. కానీ తాను సహజీవనానికి వ్యతిరేకినని స్పష్టం చేశాడు. ప్రస్తుతం ఈ హీరో “డియర్ కామ్రేడ్” సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది.

Related posts