telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

హీరోయిన్ పై స్టార్ హీరోల ఫ్యాన్స్ ఆగ్రహం… దిష్టిబొమ్మ దగ్ధం

Meera-Mithun

నటి మీరామిథున్‌ తన వివాదస్పద వ్యాఖ్యలతో కోలీవుడ్ లో దుమారం రేపుతోంది. ఈ బ్యూటీ ఆ మధ్య హీరోలు రజినీకాంత్, విజయ్, సూర్యలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. దీంతో స్టార్స్ అభిమానులు సోషల్ మీడియాలో ఇప్పటికే ఆమెను బండ బూతులు తిడుతూ ట్రోల్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో చెన్నైలో విజయ్, సూర్య అభిమానులం అంటూ కలామ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మీరా మిథున్ దిష్టి బొమ్మను తగులబెట్టారు. ఆ విషయం మీరా దృష్టికి వెళ్లడంతో “కలామ్ పేరుతో ఉన్న ఆర్గనైజేషన్ తో ఇలాంటి పనులు చేయడానికి బుద్ది లేదా..? కనీసం మీరు ఆ పేరునైనా మార్చుకోండి. కలామ్ జీకి మీరు ఇచ్చే గౌరవం ఇదేనా. ఇలాంటి పనులు చేస్తున్న మీకు ఆయన పేరు వాడుకునే అర్హత లేదు. ఈ ఘటనకు పూర్తిగా విజయ్ మరియు సూర్యలే కారణం” అంటూ ఘాటుగా వ్యాఖ్యలు చేసింది.

Related posts