telugu navyamedia
రాజకీయ

విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ‘ఆళ్వా’ నామినేషన్​ దాఖ‌లు..

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, రాజస్థాన్‌ మాజీ గవర్నర్‌ మార్గరెట్ అల్వా.. విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేశారు. మంగళవారం రిటర్నింగ్ అధికారి, లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు నామినేషన్ పత్రాలు అందజేశారు.

కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, ఎన్​సీపీ అధినేత శరద్ పవార్, వామపక్షాల నుంచి సీతారాం ఏచూరి, డి. రాజా సహా పలువురు విపక్ష నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

Margaret Alva files nomination papers for vice presidential election, Rahul  Gandhi, top opposition leaders present

ఇక అధికార పక్షం ఎన్​డీఏ తరఫున బంగాల్​ గవర్నర్​ జగదీప్​ ధన్ర్ సోమవారం నామినేషన్​ దాఖలు చేశారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల నామినేషన్లకు మంగళవారమే ఆఖరి రోజు.

ఉపరాష్ట్రపతి ఎన్నిక ఆగస్టు 6న జరగనుంది. ప్రస్తుతం ఉపరాష్ట్రపతి ఉన్న ఎం. వెంకయ్య నాయుడు పదవీ కాలం ఆగస్టు 10న ముగియనుంది. లోక్​సభ, రాజ్యసభ ఎంపీలంతా ఉపరాష్ట్రపతి ఎన్నికలో పాల్గొంటారు. నామినేటెడ్​ సభ్యులు కూడా ఓటు వేసేందుకు అర్హులే.

మార్గరెట్ అల్వా వయస్సు 80 ఏళ్లు. ఆమె గతంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. అంతేకాదు పలు రాష్ట్రాలకు గవర్నర్ గా పనిచేసిన అనుభవం ఆమెకు ఉంది. రాజస్థాన్ ,గోవాతో పాటు పలు  రాస్ట్రాల్లో ఆమె గవర్నర్ గా పనిచేశారు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన మార్గరెట్ అల్వా కాంగ్రెస్ పార్టీలో కీలకంగా పనిచేశారు.

ఉప రాష్ట్రపతి పదవికి జరుగుతున్న ఎన్నికలు ఓ చాలెంజ్ అని ఆమె అభిప్రాయపడ్డారు. అయితే ఈ సవాల్ ను స్వీకరించేందుకు తాను సిద్దంగా ఉన్నట్టుగా ఆమె ప్రకటించారు తనను విపక్ష పార్టీలు ఉప రాష్ట్రపతి పదవికి  పోటీ చేయాలని ఎంపిక చేసినందుకు ఆమె ధన్యవాదాలు తెలిపారు.

కాగా..నామినేషన్‌ కార్యక్రమానికి టీఆర్‌ఎస్‌(తెలంగాణ) దూరంగా ఉండడం గమనార్హం. మద్దతు విషయంలో ఇంకా తమ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఎంపీలు జాతీయ మీడియా వద్ద ప్రస్తావించినట్లు తెలుస్తోంది. మరికొన్ని పార్టీల నుంచి కూడా అల్వాకు మద్దతు ఇచ్చే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.

Related posts