ప్రాథమిక విద్యాబోధన మాతృభాషలోనే జరిగితే భావితరాలకు మేలు జరుగుతుందని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. బుధవారం రాజధానిలో స్వర్ణభారతి ట్రస్ట్ నిర్వహించిన ఇష్టాగోష్టిలో ఆయన మాట్లాడారు. తెలుగు భాషవల్లే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ భాషా ప్రయుక్త రాష్ట్రమని తెలిపారు.
ప్రాథమిక విద్యా బోధన తెలుగులో జరగాలన్నది తన అభిమతమని చెప్పారు.అంతమాత్రాన తాను ఇంగ్లీష్ కు వ్యతిరేకం కాదని, ఆంగ్లం కూడా అవసరమేనని అన్నారు. మాతృభాషలో బోధన ఎంత అవసరమో ప్రధాని కూడా చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. కృష్ణా జిల్లా నాగాయలంకకు మిసైల్ కేంద్రం వస్తుందని, కర్నూలు జిల్లా ఓర్వకల్లులో డిఫెన్స్ యూనివర్సిటీ, నెల్లూరులో అల్యూమినియం కర్మాగారం ఏర్పాటవుతాయని తెలిపారు.
రామ్గోపాల్ వర్మ సైకో డైరెక్టర్: యామిని