telugu navyamedia
సినిమా వార్తలు

ఖమ్మంలో “వెంకీమామ” ప్రీ రిలీజ్ ఈవెంట్

Venky-mama

మామాఅల్లుళ్లు విక్టరి వెంకటేశ్, అక్కినేని నాగ చైతన్య నటిస్తున్న చిత్రం “వెంకీ మామ”. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ తేదీ, వేదిక ఖరారైంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. “వెంకీమామ” ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను డిసెంబర్ 7న ఖమ్మంలోని లేక్ వ్యూ క్లబ్‌లో సాయంత్రం 6 గంటలకు నిర్వహిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. వెంకటేశ్ రైతుగా, నాగచైతన్య ఆర్మీ ఆఫీసర్‌గా ఈ చిత్రంలో కనిపించనున్నారు. వెంకటేశ్ సరసన పాయల్ రాజ్ పుత్, నాగచౌతన్యకు జోడీగా రాశీఖన్నా నటించనున్నారు. ఈ చిత్రం డిసెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీని కేఎస్ రవీందర్ (బాబీ) దర్శకత్వం వహించగా దగ్గుబాటి సురేశ్, టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఎస్.ఎస్.థమన్ సంగీతం అందిస్తున్నారు.

Related posts