telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

లో లెవల్‌ వంతెనల స్థానంలో పెద్ద బ్రిడ్జీల నిర్మాణం: మంత్రి వేముల

prashant reddy trs

లో లెవల్‌ వంతెనల స్థానంలో పెద్ద బ్రిడ్జీలను నిర్మిస్తున్నట్టు తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ర్ట శాసనసభలో రహదారులు వంతెనల నిర్మాణంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకుసమాధానమిస్తూ.. గత ఆరేళ్లలో రహదారుల అభివృద్ధికి సీఎం కేసీఆర్‌ ఎంతో కృషి చేశారన్నారు. రాష్ట్ర రహదారుల అభివృద్ధికి ఇప్పటికే దాదాపు రూ.10 వేల కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు.

మొత్తం 7,450 కిలోమీటర్ల మేర రాష్ట్ర రహదారుల నిర్మాణం చేపట్టినట్లు వెల్లడించారు. అన్ని మండల కేంద్రాలకు రెండు వరసల రహదారులు నిర్మిస్తున్నట్లు చెప్పారు. వాగులపై వంతెనల నిర్మాణానికి కూడా ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. దాదాపు రూ.300 కోట్ల వ్యయంతో 400కు పైగా వంతెనల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు.

Related posts