telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

పల్లెల సమగ్రాభివృద్ధి సీఎం కేసీఆర్‌తోనే సాధ్యం…

పల్లెల సమగ్రాభివృద్ధి సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. ఆదివారం బాల్కొండ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పచ్చల నడ్కుడ గ్రామంలో రైతువేదిక, పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభించారు. అలాగే వనంలో ఏర్పాటు చేసిన బుద్ధుని విగ్రహాన్ని గ్రామస్తులతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. గ్రామాల్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా పల్లె ప్రకృతి వనాలను సీఎం కేసీఆర్‌ ఏర్పాటు చేశారన్నారు. పల్లెలే దేశానికి పట్టు కొమ్మలు అని, వాటిని ఆర్థిక పరిపుష్టం చేయాలని కేసీఆర్ పల్లె ప్రగతి లాంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టారన్నారు.కేసీఆర్ ప్రభుత్వానికి తెలంగాణ ప్రజలు, రైతుల సంక్షేమమే ముఖ్యమని తెలిపారు. రైతులను సంఘటితం చేసేందుకు రైతు వేదికల నిర్మాణం చేపట్టారన్నారు. రైతులకు దేశంలో ఎక్కడా లేని విధంగా 24గంటల ఉచిత కరెంట్, ప్రాజెక్టులు నిర్మించి సాగునీరు అందించి.. పెట్టుబడికి రైతుబంధు, రైతుబీమా తదితర సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని గుర్తు చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రాజకీయాలకు తావు ఇవ్వకుండా తెలంగాణ అభివృద్ధే అజెండాగా పనిచేస్తుందని మంత్రి స్పష్టం చేశారు.

Related posts