telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

దిశ చట్టాన్ని ప్రభుత్వం పటిష్టంగా అమలు చేస్తోంది..

ఒంగోలు కలెక్టరేట్‌లో మహిళలు, బాలికలపై జరుగుతున్న వేదింపులు, నివారణ చర్యలపై అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏపీ మహిళా కమీషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ హాజరయ్యారు. ఈ సందర్బంగా వాసిరెడ్డి పద్మ కీలక వ్యాఖ్యలు చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో మహిళల రక్షణకు భాద్యత వహిస్తూ సచివాలయాల ఏర్పాటుతో పాటు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుందని పేర్కొన్నారు. కరోనా సమయంలో అధికార యంత్రాంగం మొత్తం ఆ విధుల్లో నిమగ్నమై ఉన్నా బాలికలు, మహిళలపై జరిగిన పలు ఘటనలపై సత్వరమే స్పందించి చర్యలు తీసుకోగలిగిందని తెలిపారు.

ఏదైనా ఘటన జరిగిన 21 రోజుల్లోగా భాద్యులకు శిక్షలు పడేలా దిశ చట్టాన్ని పటిష్టంగా అమలు చేసేందుకు ప్రభుత్వం అన్నీ రకాల చర్యలు తీసుకుందని చెప్పారు. దిశ చట్టాన్ని ప్రభుత్వం పటిష్టంగా అమలు చేస్తోందని గుర్తు చేసారు. ఫోక్సా చట్టం క్రింద కేసులను వేగవంతంగా విచారణకు ప్రతీ జిల్లాకు ఒక కోర్టును ఏర్పాటు చేశామని..మహిళలు, బాలికలపై జరుగుతున్న ఘటనలపై వారి రక్షణను ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని తెలిపారు. ఘటనలకు బాద్యులను 24 గంటల్లోగా అరెస్టులు చేయటంతో పాటు ఏడు రోజుల్లోగా చార్జ్ షీట్ వేసేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.

Related posts