telugu navyamedia
సినిమా వార్తలు

గొప్ప పోరాట యోధుడు… ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాము : వరుణ్ తేజ్

Anthariksham

టీమిండియా క్రికెట‌ర్‌, సిక్స‌ర్ల వీరుడు యువ‌రాజ్ సింగ్ అంత‌ర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు ప‌లికిన విషయం తెలిసిందే. దాదాపు ద‌శాబ్దం పాటు క్రీడాభిమానుల‌ను అల‌రించిన యువీ రిటైర్మెంట్ నేప‌థ్యంలో ప‌లువురు క్రీడా, సినీ ప్ర‌ముఖులు స్పందిస్తున్నారు. యువీకి శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు. తాజాగా మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ కూడా యువీకి ట్విట‌ర్ ద్వారా విషెస్ తెలియ‌జేశాడు. “నేను ఎంత‌గానో ఇష్ట‌ప‌డే క్రికెట‌ర్ యువ‌రాజ్ సింగ్‌. గొప్ప పోరాట యోధుడు. క్రికెట్ అభిమానుల‌కే కాదు యువ‌త మొత్తానికి స్ఫూర్తి. ఎన్నో మంచి జ్ఞాప‌కాల‌ను అందించినందుకు ధ‌న్య‌వాదాలు యువీ. నువ్వు మైదానంలో ఉన్నా, లేక‌పోయినా నిన్ను ఎప్ప‌ట‌కీ ప్రేమిస్తూనే ఉంటాం. నువ్వు మాకు పోరాడ‌డాన్ని నేర్పించావు. మ‌రొక్కసారి నీకు ధ‌న్య‌వాదాలు” అని వ‌రుణ్ తేజ్ ట్వీట్ చేశాడు.

Related posts