వరవరరావు అరెస్ట్ ?

13

ప్రధాని నరేంద్ర మోడీని హత్య చెయ్యడానికి మావోయిస్టులు పన్నిన కుట్రను మహారాష్ట్ర పోలీసులు బయట పెట్టారు . పోలిసుల సోదాల్లో ఈ లేఖ దొరికింది . ఈ లేఖలో తెలంగాణ ప్రాంతానికి చెందిన విప్లవ కవి వరవరరావు పేరు ఉండటం కలకలం రేపుతోంది . వరవరరావుమావోయిస్టుల సానుభూతి పరుడని అందరికీ తెలుసు . అయితే ప్రధాని నరేంద్ర మోడీని అంతమొందిందానికి పన్నిన కుట్రలో వరవరరావు పేరు రావడం గమనార్హం . దేశవ్యాప్తంగా దీనిపై చర్చ జరుగుతుంది .
మావోయిస్టులకు మద్దతు పలికే వరవరరావు ఇప్పుడు కేంద్ర నిఘా వ్యవస్థల దృష్టిలో వున్నాడు . ప్రధానిని హత్య చేయించడం అన్నది అతి పెద్ద నేరం .
ఈ కేసు విషయంలో వరవరావును అరెస్టు చేయ వచ్చునని తెలుస్తుంది . సురేంద్ర గాడ్లింగ్ అనే వ్యక్తి వరవరావు నిధులు సమకూర్చినట్టు ఆరోపణ వచ్చింది దీనిపై వరవరరావు స్పందిస్తూ నాపేరు ఎందుకు వచ్చిందో తెలియదు . పోలీసులు అరెస్ట్ చేస్తే చెయ్యవచు అని చెప్పాడు .