అమెరికా లో వంశీ రామరాజు కు ఘన సన్మానం

81

అమెరికాలోని న్యూ జెర్సీ లో శనివారం రోజు ఎడిసన్ లోని 8కె సినిమాస్ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో వంశీ రామరాజు ను ఘనంగా సత్కరించి దివ్యాంగ మిత్ర బిరుదును ప్రదానం చేశారు .
గత ౩౦ ఏళ్లుగా భారత దేశంలో వికలాంగుల కొరకు వేగేశ్న ఫౌండేషన్ ఆశ్రమాన్ని నెలకొల్పి వారికి విద్య వైద్య వసతి సదుపాయాలను కల్పించి ప్రవాస భారతీయుల సహకారంతో ముందుకు సాగుతున్న కళాబ్రహ్మ,సేవ మహాత్మా,శిరోమణి డాక్టర్ వంశీ రామరాజును ప్రవాస తెలుగువారు సన్మానించారు . అమెరికాలోని న్యూ జెర్సీ లో జరిగిన కార్యక్రమంలో ఉపేంద్ర జె చివుకుల, కమీషనర్.స్టేట్ అఫ్ న్యూ జెర్సీ బోర్డు అఫ్ పబ్లిక్ యుటిలిటీస్ప్ర ఈ బిరుదును ప్రదానం దానం చేశారు .

ఈ సందర్భంగా చివుకుల మాట్లాడుతూ , వంశీ రామరాజు నిర్వహిస్తున్న వేగేశ్న ఆశ్రమాన్ని కుంట్లూర్,రంగారెడ్డి జిల్లా లో తానూ సవ్యంగా చూశానని వారి సేవలు ప్రశంసనీయమని అన్నారు.తన జీవితాన్ని పేదవారైన చిన్నారి వికలాంగుల కొరకు త్యాగం చేస్తున్న వంశీ రామరాజు సేవలను అమెరికా ప్రభుత్వం కూడా గుర్తించేవిధంగా ప్రయత్నిస్తానని అన్నారు.
వేగేశ్న ఫౌండేషన్ మే 11 వ తేదీనుంచి ఉత్తర అమెరికాలో జులై 8 వరకు 27 ప్రాంతాలలో నిర్వహిస్తున్న పదకొండవ సద్గురు ఘంటసాల ఆరాధనోత్సవాలు మరియు స్పీ బాలసుబ్రహ్మణ్యం ఎనిమిదవ సంగీతోత్సవాల కార్యక్రమాన్నిన్యూ జెర్సీ లో చివుకుల ప్రారంభించారు.
ఈ కార్యక్రంలో తెలుగు కళాసమితి అధ్యక్షుడు సుధాకర్ ఉప్పల,న్యూజెర్సీ తెలుగు అసోసియేషన్ వైస్-ఉపాధ్యక్షుడు మంజు భార్గవ,వేగేశ్న ఫౌండేషన్ డైరెక్టర్ ప్రభ రఘునాధన్,రాధా కాశీనాధుని,మధు రాచకుల్లా,ఉష రావిళ్ల, మద్దలైనవారు పాల్గొన్నారు.

అనంతరం ఘంటసాల గీతాలను బాలకామేశ్వరరావు,శివశంకర గీతాంజలి ఆలపించి ప్రేక్షకులను అలరించింది.
ఉత్తర అమెరికాలో జరుగుతున్న ఈ దివ్యాగుల సహాయ కార్యక్రమాలను వంగూరి ఫౌండేషన్ అఫ్ అమెరికా మరియు తెలంగాణ టూరిజం వారి సహకారంతో నిర్వహిస్తున్నామని వంశీ రామరాజు తెలియ చెప్పారు .న్యూ జెర్సీ లో తనకు జరిగిన సన్మానం దివ్యాగులకు జరిగినట్టు తాను భావిస్తానని చెప్పారు . ప్రవాసాంధ్రులు ప్రతిస్పందిస్తున్న తీరు తనకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తున్నదని రామరాజు తెలిపారు .