vajpayee at aims for general checkup

సాధారణ పరీక్షల కోసమే…ఆరోగ్యంగానే వాజ్ పాయీ…

16

భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు, ఒకప్పటి ప్రధాని, అటల్ బిహారీ వాజ్ పాయీ కొంత కాలంగా పార్టీ కార్యక్రమాలలో పాల్గొనటం లేదు. అయితే ఇటీవల వారి ఆరోగ్యం అంతగా సహకరించకపోవటంతో పార్టీ విషయాలు పట్టించుకోలేకపోతున్నారు. దీనికి కారణాలు అనేకం ఉండవచ్చుకాని ప్రస్తుతానికైతే ఆరోగ్యం సహకరించకపోవటం వల్లన ఇంటి నుండి అన్ని చూసుకుంటున్నారు.

అలాగే సాధారణ వైద్యపరీక్షల నిమిత్తం నేడు ఎయిమ్స్ ఆసుపత్రికి వెళ్లారని ఆ పార్టీ వర్గాలు అధికారికంగా ధ్రువీకరించారు. గత కొన్నేళ్లుగా ఎయిమ్స్ లోని డా. రణదీప్ గులేరియా వాజ్ పాయీ ఆరోగ్యపరిస్థితిని చూసుకుంటూ ఉన్నారు, ఇప్పుడు కూడా ఎయిమ్స్ లో వారి ఆధ్వర్యంలోనే సాధారణ పరీక్షలు నిర్వహించడానికి వాజ్ పాయీ ఆసుపత్రిలో చేరినట్టు వైద్యబృందం స్పష్టం చేసింది.

అయితే పార్టీలోని అంతర్గత విభేదాలు వాజ్ పాయీ వరకు వెళ్ళటం వారికి ఆయా విషయాల వల్ల మనశాంతి లోపించటం ఈ అనారోగ్యానికి కారణం కూడా కావచ్చని ఈ వార్తపై అనేక విమర్శలు కూడా వచ్చేస్తున్నాయి.