తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉదయం నుంచి వైష్ణవ ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఆలయాల్లో ఉత్తర ద్వార దర్శనానికి ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కరోనా మార్గదర్శకాలను పాటిస్తూ ఆలయాల్లో దర్శనాలు జరుగుతున్నాయి.
తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభం..
కలియుగ వైకుంఠ స్వామి తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠద్వార దర్శనాలు ప్రారంభమయ్యాయి. బుధవారం అర్ధరాత్రి 12.05 గంటలకు శ్రీవారి వైకుంఠ ద్వారాన్ని తెరిచారు. అర్ధరాత్రి నుంచే 12 గంటల నుంచి నిత్య సేవలు, కైంకర్యాల అనంతరం వేకువజామున 1.45 గంటలకు వైకుంఠ ద్వార దర్శనం మొదలైంది.
తొలుత ప్రొటోకాల్ ప్రకారం.. VIPలను శ్రీవారి దర్శనానికి అనుమతించారు. రాజకీయ, సినీరంగ ప్రముఖులు స్వామివారి సేవలో పాల్గొన్నారు. సుప్రీం కోర్టు సీజే ఎన్వీ రమణ, పలు రాష్ట్రాల సీజేలు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు, సినిమా సెలబ్రిటీలు స్వామిని దర్శించుకున్నారు. ప్రముఖుల దర్శనాల అనంతరం సామాన్య భక్తుల్ని అనుమతించారు.
అలాగే తిరుమలలో 10రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం ద్వారా భక్తులు వెంకన్నను దర్శించుకోవచ్చు. ఈ ఉదయం 9 నుంచి 10గంటల వరకు స్వర్ణరథంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామి వారిని దర్శించుకోవడాని పెద్ద ఎత్తున భక్తులు తిరుమలకు చేరుకున్నారు.
అంతేకాకుండా వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీవారి ఆలయం అందంగా ముస్తాబైంది. మాడవీదులు విద్యుత్ దీపాలంకరణతో వెలుగిపోతున్నాయి. శ్రీనివాసుడి సన్నిధిని అరుదైన పుష్పాలు,పండ్లతో సర్వాంగ సుందరంగగా అలంకరించారు. వైకుంఠ ద్వారా దర్శనం కోసం వచ్చే భక్తులకు ఈ పుష్పాలంకరణ అదనపు ఆకర్షణ కానుంది.
మాటల్లో తేనె.. చేతల్లో కత్తెర: యనమల