telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

45 ఏళ్లలోపు వారికి వ్యాక్సిన్ ఫ్రీ కాదా…?

corona vaccine covid-19

మన దేశంలో వచ్చే నెల నుండి 18 ఏళ్ళు పైబడిన వ్యక్తులు అందరికి వ్యాక్సిన్ వేసుకునే వెసులుబాటును కల్పించింది.  ప్రస్తుతం 45 ఏళ్ళు పైబడిన వారికీ వ్యాక్సిన్ అందిస్తున్నారు. రెండో విడత వ్యాక్సినేషన్ లో ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రిలో వ్యాక్సిన్ అందిస్తున్నారు.  ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఫ్రీగా, ప్రైవేట్ ఆసుపత్రుల్లో నామమాత్రపు ధరలతో వ్యాక్సిన్ అందిస్తున్నారు.  అయితే, మూడో విడతలో 18 ఏళ్లకు పైబడిన వారికి వ్యాక్సిన్ అందించే అందించబోతున్న సంగతి తెలిసిందే.  అయితే, 18 ఏళ్ళు పైబడిన వారికీ ఫ్రీగా వ్యాక్సిన్ అందించే అవకాశం లేదని సమాచారం.  కేవలం 45 ఏళ్ళు దాటిన వారికి మాత్రమే ఫ్రీ వ్యాక్సిన్ అందించనున్నారు.  ఇక ఉత్పత్తి సంస్థలు కేంద్రానికి కేవలం 50శాతం వ్యాక్సిన్ మాత్రమే అందించబోతున్నది.  మిగిలిన 50 శాతం వ్యాక్సిన్ ను బహిరంగ మార్కెట్లో, ప్రైవేట్ ఆసుపత్రులకు విక్రయించుకునే వెసులుబాటు ఉండటంతో వ్యాక్సిన్ ఫ్రీగా దొరికే అవకాశం ఉండకపోవచ్చు.

Related posts