telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

కోహ్లీ పై సెటైర్ ఉత్తరాఖండ్ పోలీసులు…

మాములుగా ట్రాఫిక్ రూల్స్‌పై అవగాహన పెంచేందుకు పోలీసులు వినూత్న పద్దతిని ఉపయోగిస్తుంటారు. అయితే ఇప్పుడు కోహ్లీ డక్ అవుట్ ను ఉపయోగించుకొని కూడా ఉత్తరాఖండ్ పోలీసులుఅలంటి ప్రయత్నమే చేసారు. అయితే నిన్న ఇంగ్లాండ్ తో జరిగిన మొదటి టీ 20 మ్యాచ్ లో 5 బంతులు ఆడిన విరాట్ కోహ్లీ భారీ షాట్‌కి ప్రయత్నించి వెనుదిరిగాడు. అయితే విరాట్ డకౌట్‌ను ఉత్తరాఖండ్ పోలీసులు వినూత్నంగా వాడుకున్నారు. డకౌటై పెవిలియన్‌కు వెళ్తున్న ఫొటోను షేర్ చేస్తూ… ‘హెల్మెట్ వేసుకుంటే సరిపోదు. పూర్తి స్పృహతో వాహనం నడపాలి. అలా డ్రైవింగ్ చేయకపోతే కోహ్లీలా మీరు డకౌట్ అవుతారు.’అంటూ తెలిపారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్‌గా మారింది. చాలా మంది దీని పై ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. మరి కొత్త మంది కోహ్లీ అభిమానులు మాత్రం సీరియస్ అవుతున్నారు. అయితే ఈ మ్యాచ్ లో డకౌటైన కోహ్లీ.. ఈ ఏడాది ఇప్పటికే మూడు సార్లు సున్నా పరుగులకే వెనుదిరిగాడు. అంతేకాకుండా అత్యధిక సార్లు డకౌట్ అయిన భారత కెప్టెన్‌గా చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.

Related posts