టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కేసీఆర్ ప్రభుత్వంపై మరోసారి నిప్పులు చెరిగారు. పీవీని… కేసీఆర్ అనరాని మాటలు అన్నారని..పీవీ పై కేసీఆర్ చేసిన ఆరోపణలపై త్వరలోనే వీడియో లు విడుదల చేస్తామని హెచ్చరించారు. పీవీ వాణిని…మరో శంకరమ్మను చేయబోతుంది టీఆర్‌ఎస్ పార్టీ అని ఫైర్ అయ్యారు. వామన రావు దంపతులు దళితుల పక్షాన కొట్లాడితే న్యాయ వాదులను టీఆర్‌ఎస్ నాయకులు నరికి చంపారని ఆరోపించారు. ఇన్ని రోజులు తండ్రి జర్నలిస్టులను మోసం చేశారని.. ఇప్పుడు కొడుకు మోసం చేస్తున్నాడని ఫైర్ అయ్యారు. రెండు సీట్లు ఓడిపోతామని భయం టీఆర్‌ఎస్‌కి పట్టుకుందని… ఓటర్లను బెదిరించి..ప్రమాణం చేయిస్తున్నారని ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఫైర్ అయ్యారు. ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశామని..ఓటర్లను బెదిరించడం… ఎన్నికల కోడ్ ఉల్లంఘనేనన్నారు. ఉపాధ్యాయు సంఘాల నాయకులను మంత్రులు బెదిరించి… టీఆర్‌ఎస్‌కి మద్దతు అని బలవంతంగా ప్రకటించుకుంటున్నారని తెలిపారు. ఉపాధ్యాయులు, ఉద్యోగుల ఆత్మగౌరవానికి సంబంధించిన ఎన్నికలు ఇవి… ఉద్యోగుల prc కోసం, ప్రమోషన్లు, బదిలీల గురించి కొట్లాడతామని ఆయన హామీ ఇచ్చారు. మీ ఆత్మగౌరవానికి భంగం కలిగించింది టీఆర్‌ఎస్ అని… బీజేపీ, టీఆర్‌ఎస్‌కి దిమ్మదిరిగే సమాధానం ఇవ్వాలని కోరారు. చిన్నారెడ్డి, రాములు నాయక్ నిరుద్యోగులు, ఉద్యోగుల పక్షాన కొట్లాడతారన్నారు.
previous post
ఆ కథనం ప్రసారం చేసినందుకే.. ప్రభుత్వం నన్ను టార్గెట్ చేసింది