uthamkumarreddy-on-assembly-issue

అసెంబ్లీ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోంది : ఉత్తమ్‌

32

తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి లు ఆరోపించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ కోర్ట్ తీర్పు వచ్చి 50 రోజులైనా ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌ కమార్‌ల సభ్యత్వ రద్దు విషయంలో హైకోర్టు తీర్పును అమలు చేయడం లేదని ఆరోపించారు. సీఎల్పీ బృందం స్పీకర్‌ మధుసూదనచారిని కలిసి సభ్యత్వాన్ని పునరుద్దరించాలని కోరారు. ప్రభుత్వం కూడా జోక్యం చేసుకుని​ స్పీకర్‌కు సలహాలు ఇవ్వాలని సూచించారు. చట్టాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన అవసరముందని అన్నారు.

కోర్టు తీర్పు అమలు చేసి స్పీకర్‌ హుందాగా వ్యవహరించాలని, లేదంటే ప్రజాస్వామ్య పద్ధతిలో ముందుకెళ్తామని జానారెడ్డి తెలిపారు. కోర్టు తీర్పును ఎందుకు అమలు చేయడంలేదని స్పీకర్‌ను అడిగినట్టు వారు పేర్కొన్నారు. రాష్ట్రపతిని కలిసి తెలంగాణలో పరిస్థితిని వివరిస్తామని చెప్పారు. కోర్టు తీర్పును అమలు చేయకుంటే జాతీయ స్థాయిలో ఉద్యమిస్తామన్నారు. అవసరమైతే సుప్రీం కోర్ట్ కూడా ఆశ్రయిస్తామని హెచ్చరించారు.