telugu navyamedia
ఆంధ్ర వార్తలు

సీసీఎస్ ర‌ద్దుపై ఉపాధ్యాయుల సీఎంవో ముట్టడి.. 144 సెక్షన్ విధింపు

విజయవాడ: కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌ (సీపీఎస్‌)ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ (UTF) ఇవాళ(సోమవారం) ఛలో సీఎంవో కు పిలుపివ్వడంతో భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటుచేశారు.

విజయవాడకు వచ్చే అన్ని ప్రధాన రహదారుల్లో భారీగా మొహరించారు పోలీసులు. ఉపాధ్యాయ సంఘం చేపట్టే ఆందోళనకు ఎలాంటి అనుమతిలేదని… గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో సెక్షన్ 144 మరియు సెక్షన్ 30 ఆఫ్ పోలీస్ యాక్ట్ అమలులో వుంటుందని పోలీసులు తెలిపారు

తాడేపల్లి బైపాస్ లో సీఎం క్యాంపు కార్యాలయం వైపు వెళ్లే రోడ్లలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ఈ క్రమంలోనే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా భారీగా పోలీసులు మొహరించారు. సర్వీస్ నుంచి నేషనల్ హైవే మీదకి రాకుండా మధ్యలో ఫెన్సింగ్.. ముళ్ల కంచెలతో భద్రత ఏర్పాటుచేశారు.

Cps Police

ఉద్యోగ, ఉపాధ్యాయుల బైక్‌ ర్యాలీలను అడ్డుకుంటున్నారు పోలీసులు. యూటీఎఫ్ నేత‌ల్ని పోలీసుల ఎక్క‌డక్క‌డ అరెస్ట్ లు చేసి స్టేష‌న్‌కి త‌ర‌లిస్తున్నారు.

ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ అమలు చేయాలని అడిగినందుకు ఉపాధ్యాయుల్ని ప్రభుత్వం అరెస్టు చేస్తోందని ఉపాధ్యాయుల ఆగ్రహం వ్యక్తం చేశారు.

Related posts