USA-vermont-government-givi

మా రాష్టానికోస్తే $10000 డాలర్లు…

36

ఈశాన్య అమెరికాలో విన్నూత్న పథకం ప్రవేశపెట్టారు. ఈశాన్య అమెరికా వెర్మాంట్ రాష్ట్ర ప్రభుత్వం ఇంటినుంచే పనిచేసే వారికీ ఏడాదికి పన్ను చెల్లింపులో $10000 డాలర్ల సహాయం చేయనుంది. ఈ చట్టం ఫై వెర్మాంట్ రాష్ట్ర గవర్నర్ ఫిల్ స్కాట్ బుధవారం అధికారికంగా సంతకాలు జరిపారు. ఎవరైనా ఉద్యోగులు ఇంటినుంచే (రిమోట్) పని చేసుకునే వారికోసం మరియు తమ రాష్ట్రంలో స్థిరపడడానికి వచ్చిన అభ్యర్థులకు తొలి మూడేళ్లలో ఏడాదికి $10 వేల డాలర్లను స్టైఫండ్ గా మూడేళ్లపాటు ఇవ్వనుంది.

vermont-govenament-signed

ఈశాన్య అమెరికా రాష్ట్రం వెర్మాంట్ లో ఈ చట్టం వచ్చే ఏడాది జనవరి నుంచి అమలులోకి రానుంది, అయితే రాష్ట్రానికి వచ్చే మొదటి వంద మందికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుందట. వచ్చే సంవత్సరంలో ఇరవై మందికి మాత్రమే ఈ పథకం వర్తించనుందని తెలిపింది. రాష్ట్రంలో వృద్ధాప్య జన సంతతి పెంచుకునేదనుకోసమే ఈ పథకం అమలుచేస్తున్నామని ప్రభుత్వ కార్యకర్తలు తెలిపారు, అలాగే రాష్ట్రానికి స్థిరపడడానికి వచ్చిన టెక్ అభ్యర్థులకు సౌకర్యవంతమైన పాలనలో ప్రత్యామ్నాయ భయము లేకుండా అనువైన ఏర్పాట్లు చేయడం హక్కుగా భావిస్తున్నామన్నారు.

ప్రస్తుతం వెర్మాంట్ లో పారిశ్రామిక సంస్థల ఆదాయం $1,25,000 డాలరర్లుగా ఉండగా, 2020 నాటికి $2,50,000 ఆదాయం వస్తుందని అంచనాలు వేస్తున్నారు. వెర్మాంట్ చేపట్టిన పథకం రాష్ట్ర అభివృద్ధికి పాల్పడనుంది, దీనితో అమెరికాలోని పలు రాష్ట్రాల ప్రజలు వెర్మాంట్ వెళ్లడానికి ఆసక్తి చూపుతున్నారు.