urban housing scheme bjp vs tdp

ఇళ్ల నిర్మాణంపై ఇరువురి మధ్య వాగ్వివాదం…

85

టీడీపీ ఎమ్మెల్సీ బాబు రాజేంద్ర ప్రసాద్ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి ల సవాళ్ల మధ్య హై డ్రామా నెలకొంది, అర్బన్ హోసింగ్ (ఇళ్ల) నిర్మాణంపై సవాళ్లు విసురుకున్న ఇద్దరు నేతలు ఈరోజు ఉయ్యురులో తేల్చుకోవడానికి బయలు దేరారు. ఉయ్యురులో రాజేంద్ర ప్రసాద్ తో చర్చించేందుకు విజయవాడ నుంచి బయలుదేరిన విష్ణు వర్ధన్ రెడ్డిని కంకిపాడులో పోలీసులు అడ్డుకున్నారు. ప్రస్తుతం కంకిపాడు పోలీస్ స్టేషన్ దగ్గరనే విష్ణువర్ధన్ ను అదుపులోకి తీసుకొని అరెస్టు చేశారు. శాంతి భద్రతల సమస్యలు దృష్టిలో పెట్టుకొని మాత్రమే విష్ణువర్ధన్ రెడ్డిని అరెస్ట్ చేశామని పోలీసులు తెలుపుతున్నారు.

రాష్ట్రంలో జరుగుతున్న అంశాలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ, మరియు బీజేపీ బల ప్రదర్శనకు కానీ ప్రభుత్వం పై విమర్శలు చేయడానికి కాని రాలేదని, పేద ప్రజలకు ఉపయోగపడే అర్బన్ హోసింగ్ నిర్మాణంపై కొనసాగుతున్న అక్రమాలకు సంబందించిన చర్చ జరపడం కోసం మాత్రమే వచ్చామని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పుకుంటూ వచ్చారు. పోలీసులను గౌరవిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి సంబందించిన లా అండ్ ఆర్డర్ కు సహకరిస్తున్నామన్నారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రవేశ పెట్టిన ఆవాస్ పథకం కింద కేటగిరి 1, కేటగిరి 2, కేటగిరి 3 ల కోసం వరుసగా రూ. 2,65,000, రూ. 3,15,000, మరియు రూ. 3,65,000 రూపాయలను బ్యాంకుల్లో రుణాలు తీసుకొని కట్టమంటున్నారు. దీనిపై వ్యతిరేక ఆరోపణలు చేసిన రాజేంద్ర ప్రసాద్ తో ఆరోగ్య పరమైన చర్చలు నిర్వహించేందుకు పోలీస్ స్టేషన్ లో పోలీసుల సమక్షంలోనే సమావేశం ఏర్పాటు చేయమని పోలీసులకు తెలుపుకున్నారు విశనివార్దం రెడ్డి. దీనికి సంబంధించి ఎమ్మెల్సీ బాబు రాజేంద్రప్రసాద్ ప్రస్తుతం పోలీస్ స్టేషన్ లో చర్చించడానికి బయలుదేరగా  చర్చలు విఫలం చేసేందుకు పోలీసులు విష్ణువర్ధన్ రెడ్డిని కంకిపాడు పోలీస్ స్టేషను నుంచి తరలించారు. 

పోలీసులు ఎవరి ఆదేశాలతో ఇదంతా జరుపుతున్నారని ఒకవైపు ప్రజలకు అనుమానం వ్యక్తమవుతుంది.