telugu navyamedia
వార్తలు సామాజిక

కేవలం ఒక లైటు, ఒక ఫ్యాను ..పేదోల్ల ఇంటికి రూ.128 కోట్ల కరెంట్ బిల్లు

current pole

విద్యుత్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఓ పేద వృద్ధుడి ఇంటికి ఏకంగా రూ.128,45,95,444 బిల్లు వచ్చింది. వివరాల్లోకి వెళితే ఉత్తరప్రదేశ్‌లోని హపూర్ నగర పరిధిలో ఉన్న చమ్రీ వాసి షమీమ్ ఇంటికి అక్కడి విద్యుత్ శాఖ సిబ్బంది ఇటీవల కరెంట్ బిల్లు అందజేశారు. అందులో ఉన్న ఆ బిల్లు మొత్తాన్ని చూసి షమీమ్ ఖంగు తిన్నాడు. వెంటనే సంబంధిత శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. అయినా ఎవరూ పట్టించుకోవడం లేదని అతను ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

బిల్లు కట్టలేదని చెప్పి ఇప్పటికే తమ ఇంటికి ఉన్న కనెక్షన్‌ను విద్యుత్ సిబ్బంది తొలగించారని వాపోతున్నాడు. బిల్లు మొత్తం చెల్లించాల్సిందేనని వారు తనను ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పారు. తమ ఇంట్లో ఉన్నది కేవలం ఒక లైటు, ఒక ఫ్యాను అని.. వాటికి అంత బిల్లు ఎలా వస్తుందని అతను ప్రశ్నిస్తున్నాడు. సాంకేతిక సమస్య వల్లే అలా కరెంటు బిల్లు తప్పుగా వచ్చిందని సమస్యను త్వరలోనే పరిష్కరించి అసలు బిల్లును వినియోగదారునికి అందజేస్తామని అధికారులు తెలుపడం కొసమెరుపు.

Related posts