telugu navyamedia
తెలంగాణ వార్తలు

భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నయూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌ చార్మినార్‌ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు భాగ్యనగరానికి వచ్చిన యోగి.. ఆదివారం ఉదయం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా యోగి ఆదిత్యనాథ్ స్వయంగా అమ్మవారికి హారతినిచ్చారు.

భాగ్యలక్ష్మీ అమ్మ సేవలో యోగి ఆదిత్య నాథ్

యోగి ఆదిత్యనాథ్‌తో పాటు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, ఎమ్మెల్యే రాజాసింగ్, రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్, పలువురు బీజేపీ నేతలు భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న వారిలో ఉన్నారు. యోగికి ఆలయ కమిటీ భాగ్యలక్ష్మి అమ్మవారి చిత్రపటాన్ని బహుకరించింది.

Uttar Pradesh CM Yogiadityanath visited Bhagyalakshmi temple in Old city of Hyderabad near Charminar on Sunday. (Photo | Jwala)

యోగి రాక సందర్భంగా చార్మినార్ పరిసరాల్లో అణువణువునా పోలీసులు నిఘా పెట్టారు. భాగ్య లక్ష్మి టెంపుల్ చుట్టూ 500 మీటర్ల రేడియస్‌లో మూడు వలయాలతో భద్రత ఏర్పాట్లు చేశారు. రూట్ టాప్ భద్రతను సౌత్ జోన్ పోలీసులు పటిష్టం చేశారు. మొత్తం 350మంది పోలీస్‌లతో చార్మినార్ భాగ్యలక్ష్మి లాడ్ బజార్, సర్దార్ మహల్ చూట్టూ భద్రతను ఏర్పాటు చేశారు. భాగ్యలక్ష్మి దేవాలయం ఎంట్రీ అండ్ ఎగ్జిట్‌ను ఎస్పీజీ కమాండోస్ తమ అధీనంలోకి తీసుకున్నారు.

భాగ్యలక్ష్మీ అమ్మ సేవలో యోగి ఆదిత్య నాథ్

Related posts