telugu navyamedia
రాజకీయ

లఖింపుర్ హింస కేసులో పోలీసుల ముందుకు కేంద్ర‌మంత్రి కుమారుడు..

ఉత్తరప్రదేశ్‌లోని లఖింపుర్‌ ఖేరిలో జరిగిన హింసాత్మక ఘటనకు ప్రధాన కారకుడిగా భావిస్తున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్‌ మిశ్రా కుమారుడు ఆశిష్‌ మిశ్రా ఎట్టకేలకు బయటకొచ్చారు.

ఉత్తరప్రదేశ్‌లోని లఖింపుర్‌ ఖేరిలో జరిగిన హింసాత్మక ఘ‌ట‌న‌కు కార‌ణ‌మైన కేంద్ర మంత్రి అజ‌య్ మిశ్రా కుమారుడు ఆశిశ్ మిశ్రా ఈరోజు క్రైమ్ బ్రాంచ్ ముందు హాజ‌ర‌య్యారు. ఘటన జరిగిన అనంతరం కన్పించకుండా పోయిన ఆయన.. విచారణ నిమిత్తం శనివారం ఉదయం పోలీసుల ఎదుట హాజరయ్యారు.

My son innocent, will appear before police on Saturday, says MoS Ajay Mishra | Deccan Herald లఖింపుర్‌ ఘటనలో సుప్రీం కోర్టు ఆదేశాల‌తో విచారణకు హాజరుకావాలని పోలీసులు ఆశిశ్ మిశ్రాకు నోటీసులు జారీ చేసింది. దీంతో ఆయ‌న ఈరోజు క్రైమ్ బ్రాంచ్ ముందు హాజ‌ర‌య్యారు. ప్ర‌స్తుతం పోలీసులు ఆశిశ్ మిశ్రాను విచార‌ణ చేస్తున్నారు.

గ‌త ఆదివారం ల‌ఖింపూర్‌లో కేంద్రం తీసుకొచ్చిన రైతు చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా నిర‌స‌న‌లు చేస్తున్న‌ స‌మ‌యంలో కేంద్ర మంత్రి కుమారుడి కారు, మరో వాహనం రైతుల‌పైకి దూసుకెళ్లింది. . ఈ ఘటనలో నలుగురు రైతులు మరణించగా, అనంతరం జరిగిన అన్నదాతల దాడిలో మరో నలుగురు చనిపోయారు. ఈ ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపింది.

Lakhimpur Kheri violence | Union minister's son summoned by police; two people being questioned - The Hindu

దీనిపై పోలీసులు వెంట‌నే ఎలాంటి చ‌ర్య‌లు తీసుకొక‌పోవ‌డంతో పెద్ద ఎత్తున ఆందోళ‌న‌లు చేశాయి ప్ర‌తిప‌క్షాలు. దీనిపై సుప్రీంకోర్టు సీరియ‌స్ కావ‌డంతో పాటుగా చర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించ‌డంతో పోలీసులు ఆశిశ్ మిశ్రా కు నోటీసులు జారీ చేశారు.

Related posts