telugu navyamedia
సినిమా వార్తలు

ధూమ్ హీరో షాకింగ్ ట్వీట్… ఆత్మహత్యకు ఇదే కరెక్ట్ టైమ్

ప్రముఖ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్ అధినేత యష్ చోప్రా కుమారుడు ఉదయ్ చోప్రా ట్విట్టర్ ద్వారా షాకింగ్ ట్వీట్ లు చేశారు. ”ఓ విషయం చెప్పాలనుకుంటున్నా.. నా పరిస్థితి బాగాలేదు.. ప్రయత్నిస్తున్నాను కానీ ఓడిపోతూనే ఉన్నాను. కొన్ని గంటల పాటు నా ట్విట్టర్ ను డీయాక్టివేట్ చేశాను. చావుకి దగ్గరగా ఉన్నట్లు అనిపిస్తోంది. చెప్పాలంటే ఆత్మహత్య చేసుకోవడానికి ఇదే కరెక్ట్ టైం అనిపిస్తోంది. త్వరలో శాశ్వతంగా వెళ్లిపోతాననిపిస్తుంది” అంటూ ట్వీట్ చేశారు.

Uday-Chopra

ఈ ట్వీట్ చూసిన నెటిజన్లు అసలేం జరిగిందో అర్థం కాక షాక్ అయ్యారు. అసలు ఉదయ్ ఇలా మాట్లాడడానికి గల కారణం ఏంటో ఎవరికీ అంతుచిక్కలేదు. దయచేసి ఎలాంటి తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. అయితే ఉదయ్ ట్వీట్ చేసిన కొద్దిసేపటికే ఈ ట్వీట్ ను తొలగించడం గమనార్హం. కానీ అప్పటికే అది నెటిజన్ల దృష్టిలో పడడంతో ఆ ట్వీట్ స్క్రీన్ షాట్లు నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి. ఉదయ్ ‘ధూమ్‌’, ‘ధూమ్‌ 2’, ‘ప్యార్‌ ఇంపాజిబుల్‌’ వంటి చిత్రాల్లో నటించారు. అయితే ఇటీవల కాలంలో ఆయన బాగా లావై గుర్తుపట్టలేని విధంగా మారిపోయారు. ఉదయ్ కు వచ్చిన సమస్య ఏంటో తెలియాల్సి ఉంది.

Related posts