telugu navyamedia
సినిమా వార్తలు

వైరల్ వీడియో : కడుపులోనే కొట్టుకుంటున్న కవల పిల్లలు

Twins

సాధారణంగా ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే వారిని భరించడం కష్టం. కొంతమంది పిల్లలు ఎప్పుడూ కొట్టుకుంటూనే ఉంటారు. అయితే అప్పుడప్పుడు మాత్రం వాళ్ళ తెలివిని చూసి ఆశ్చర్యపోవడం మన వంతవుతుంది. ఇప్పుడు వచ్చే కొత్త జెనెరేషన్ మరీ ఫాస్ట్ గా ఉన్నారు. తాజాగా ఇద్దరు ట్విన్స్ తల్లికడుపులోనే కొట్టుకున్నారు. వాళ్లు ఇంకా భూమ్మీదకు కూడా రాలేదు కానీ… తల్లి కడుపులోనే తెగ కొట్టేసుకుంటున్నారు. లోపల ఇద్దరి మధ్య ఏం బెడిసి కొట్టిందో కానీ.. వాళ్ల తల్లికి అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తుండగా వాళ్లు కొట్టుకునే దృశ్యాన్ని డాక్టర్లు చూసి షాకయ్యారు. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వామ్మో వీళ్లు తల్లికడుపులోనే ఇలా ఉంటే బయటికి వస్తే ఏం విధ్వంసం సృష్టిస్తారో? ఈ ఘటన చైనాలో చోటు చేసుకున్నది.

Related posts