telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

నేడు ఐదేళ్లలోపు పిల్లలన్న వారికి.. స్వామివారి స్పెషల్ దర్శనం!

tirumala temple

నేడు తిరుమలలో ప్రత్యేక దర్శనానికి భక్తులను అనుమతించేందుకు టీటీడీ నిర్ణయించింది. చంటిబిడ్డలున్న తల్లిదండ్రులకు కొన్ని ప్రత్యేక దినాల్లో ప్రత్యేక దర్శనాన్ని కల్పించనున్నారు. ఏడాది వయసుకు బదులుగా, ఐదేళ్లలోపు వయసున్న పిల్లల తల్లిదండ్రులకు ఈ రోజు స్పెషల్ దర్శనం లభించనుంది. ఇటీవల టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన సమావేశమైన బోర్డు తీసుకున్న నిర్ణయం తీసుకుంది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకూ ఏ విధమైన క్యూలైన్లలో వేచి చూడకుండా ఐదేళ్లలోపున్న తమ పిల్లలతో సహా తల్లిదండ్రులు స్వామిని దర్శించుకోవచ్చని అధికారులు తెలిపారు.

ఈ రోజు  ఉదయం తిరుమలలో రద్దీ అధికంగా ఉంది. స్వామి దర్శనానికి వేచి చూస్తున్న భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 18 కంపార్టుమెంట్లు నిండివున్నాయి. దర్శనానికి 12 నుంచి 14 గంటల వరకూ సమయం పడుతుందని, క్యూలైన్లలో వేచివున్న వారికి అన్నపానీయాలు ఏర్పాటు చేస్తున్నామని అధికారులు తెలిపారు.

Related posts