తిరుపతి తొక్కిసలాట ఘటనలో గాయపడిన వారికీ టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడుతో పాటు కొందరు బోర్డు సభ్యులు పరిహారం అందజేశారు.
కడప జిల్లా వీరప్పనాయనపల్లి మండలం సర్వరాజుపేట కాలనీకి చెందిన జి.శైలజకు రూ. 2లక్షలు డీడీని పంపిణీ చేశారు.
శుక్రవారం తిరుమలలోని చైర్మన్ క్యాంపు కార్యాలయంలో చైర్మన్ బీఆర్ నాయుడు, సభ్యులు జ్యోతుల నెహ్రూ, శాంతారాం బాధితురాలికి డీడీ అందజేశారు.