telugu navyamedia
ఆంధ్ర వార్తలు

15 నిమిషాల్లోనే టీటీడీ సర్వదర్శనం టోకెన్లు ఖాళీ..

ఏడుకొండల వేంకటేశ్వర స్వామివారిని దర్శించేందుకు ఎక్కడెక్కడినుంచే భక్తులు వస్తుంటారు. శ్రీవారి దర్శనం కోసం భక్తులు ఎంతగా ఎదురుచూస్తున్నారో తాజాగా టీటీడీ వెబ్‌సైట్‌లో దర్శన టికెట్ల బుకింగ్‌ తీరును చూస్తే అర్థమవుతోంది.

అయితే కరోనా నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి దర్శనానికి పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతిస్తుంది. కోవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకుంది.

శ్రీవారి దర్శానానికి ఆన్‌లైన్‌లో టికెట్లను టీటీడీ విడుదల చేస్తోంది. తాజాగా జనవరి నెలకు సంబంధించి 2.60 లక్షల టోకెన్లను టీటీడీ ఈ రోజు ఉదయం 9 గంటలు విడుద‌ల చేసింది. అయితే విడుదల చేసిన 15 నిమిషాల వ్యవధిలోనే మొత్తం టొకెన్లు అన్ని బుక్కాయ్యాయి.

కాగా.. రోజుకు 10 వేల చొప్పున, వైకుంఠ ఏకాదశి సందర్భంగా వచ్చే నెల 13 నుంచి 22 వరకు రోజుకు 5వేల చొప్పున అందుబాటులోకి తీసుకొచ్చిన టికెట్లన్నీ కేవలం 15 నిమిషాల్లోనే బుక్‌ కావడం గమనార్హం.

ఇక, జనవరి నెలకు సంబంధించి శ్రీవారి రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను టీటీడీ శుక్రవారం విడుదల చేసింది. మొత్తం 4,60,000 లక్షల టికెట్లు విడుదల చేసింది.

Related posts