ttd issued notice to vijayasaireddy and ramanadikshitulu

విజయసాయిరెడ్డి, రమణ దీక్షితులుకు తితిదే నోటీసులు

17

తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరిస్తున్నారని వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయ్‌సాయిరెడ్డి, ఆలయ మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణ దీక్షితులుకు తితిదే నోటీసులు జారీ చేసింది. ఇటీవల కాలంలో తితిదేతో పాటు రాష్ట్ర ప్రభుత్వంపైనా విజయసాయిరెడ్డి, రమణ దీక్షితులు ఆరోపణలు చేశారు.

శ్రీవారి ఆభరణాలు సీఎం చంద్రబాబు ఇంట్లో ఉన్నాయంటూ విజయసాయిరెడ్డి ఇటీవల తీవ్రస్థాయిలో ఆరోపించారు. రమణ దీక్షితులు సైతం చెన్నై, హైదరాబాద్‌, ఢిల్లీ ప్రాంతాల్లో మీడియా సమవేశాలు ఏర్పాటు చేసి పలు విమర్శలు గుప్పించారు. వీటిపై తితిదే ధర్మకర్తల మండలి తీవ్రంగా స్పందించింది. దేవస్థానం పరువుకు భంగం కలిగిస్తున్న వ్యక్తులపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని తితిదే తీర్మానించింది. దేవస్థానం పరువుకు భంగం కలిగించిన మీపై ఎందుకు చర్యలు తీసుకోరాదో వివరణ ఇవ్వాలని నోటీసుల్లో తితిదే సంజాయిషీ కోరింది.