telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

ఆ విషయాల పై కీలక నిర్ణయాలు తీసుకున్న టీటీడీ పాలకమండలి…

ttd plans to venkanna temples in mumbai and j & K

ఇవాళ సమావేశమైన టీటీడీ పాలకమండలి వివిధ అంశాలపై చర్చించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది… . ఆ తర్వాత టీటీడీ ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేశారు. టీటీడీకి దేశవ్యాప్తంగా 1,128 ఆస్తులు ఉండగా.. 8,088 ఎకరాల స్థలాలు ఉన్నాయని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న టీటీడీ ఆస్తులను ఏ విధంగా వినియోగంలోకి తేవాలన్న అంశంపై త్వరలోనే ఓ నిర్ణయానికి రానున్నట్టు తెలిపారు టీటీడీ చైర్మన్‌ సుబ్బారెడ్డి.. ఇక, ఈ ఏడాది వైకుంఠ ఏకాదశి సందర్భంగా 10 రోజులు వైకుంఠ ద్వారాలను తెరిచి ఉంచాలని నిర్ణయం తీసుకుంది టీటీడీ.. నడకమార్గంలో ఉన్న గోపురాలకు మరమ్మతులు చేపట్టాలని నిర్ణయించారు. తిరుమలలో పర్యావరణ పరిరక్షణ కోసం డీజిల్‌ బస్సుల స్థానంలో 100 నుంచి 150 ఎలక్ట్రిక్ బస్సులు నడపనున్నారు. ఇక, పద్మావతి అమ్మవారికి 11 కిలోల బంగారంతో సూర్యప్రభ వాహనంను తయారు చేయాలని నిర్ణయానికి వచ్చారు. మరోవైపు రూ.29 కోట్లతో తిరుమలలో కాటేజీల ఆధునీకరణ పనులు చేయనున్నారు. ఏపీలోని అన్ని జిల్లా కేంద్రాల్లో కళ్యాణమస్తు పునఃప్రారంభిస్తామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు.

Related posts