telugu navyamedia
ఆంధ్ర వార్తలు

శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా నిర్వహిస్తాం :టీటీడీ

ఎస్వీబీసీ నిర్వహిస్తున్న అదివో అల్లదివో ప్రోమో కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి. శ్రీవారికి ఆధ్యంతం ఇష్టమైన గాయకుడు తాళ్ళపాక అన్నమాచార్యులు. ఆయన రచించిన కీర్తనలు ఎస్వీబీసీ ద్వారా బహుళ ప్రపంచానికి పరిచయం చెయ్యాలని నిర్ణయించింది. అందులో భాగంగా ఎస్వీబీసీ అధివో అల్లదివో కార్యక్రమాన్ని నిర్వహించాలనుకున్నాం. 15 నుండి 25 సం వయసు గల గాయని గాయకులకు ఎస్వీ బిసి అవకాశం కల్పిస్తుంది. మొదటి విడతగా చిత్తూరు జిల్లావాసులకు అటు తరువాత రెండు తెలుగు రాష్ట్రాల్లో నిర్వహిస్తాం అన్నారు.

రాబోవు రెండు మూడు నెలల్లో కరోనా తీవ్ర రూపం ధాలుస్తుంది అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హెచ్చరికలు చేసింది. అక్టోబర్ నెల 7 నుండి జరిగే బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా నిర్వహిస్తాం. కరోనా కారణంగా బ్రహ్మోత్సవాలు ఏకాంతం చేసాం. అందులో భాగంగానే నేడు పరిమిత సంఖ్యలో భక్తులకు దర్శనం కల్పిస్తున్నాం. మరో వారంలో ఆన్లైన్ ద్వారా సర్వదర్శన టోకెన్ ప్రక్రియ ప్రారంభిస్తాం. ప్రస్తుతం ఉన్న సర్వర్లు డేటా స్పీడ్ అందుకోలేక పోతున్నాయి. జియో వాళ్ళతో సంప్రదింపులు చేసాం త్వరలోనే సర్వదర్శన టోకెన్లను భక్తులకు అందుబాటులోకి తీసుకు వస్తాం అని అన్నారు.

Related posts