telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

“రైట్ రైట్” అంటూ కార్మికులు..”హోల్డ్ ఆన్” అంటూ యాజమాన్యం!

rtc protest started with arrest

తెలంగాణ ఆర్టీసీ కార్మికులు స్వచ్ఛందంగా సమ్మె విరమించి విధుల్లో చేరేందుకు డిపోల వద్దకు వెళ్తున్నా కార్మికులను పోలీసులు అడ్డుకుంటున్నారు. ఆర్టీసీ యాజమాన్యం అనుమతి లేనందున విధుల్లో చేరడం కుదరంటూ కార్మికులను వెనక్కి పంపివేస్తున్నారు. రైటు రైటు అంటూ కార్మికులు..”హోల్డ్ ఆన్ అంటూ ఆర్టీసీ యాజమాన్యం ఉండడంతో విధుల్లోకి తీసుకోవడం లేదు. ఇప్పటికే పలువురు జేఏసీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డిపోల వద్దకు చేరుకున్న కార్మికులు.. తాత్కాలిక కండక్టర్లను, డ్రైవర్లను అడ్డుకుంటున్నారు. దీంతో పోలీసులు కార్మికులను అరెస్ట్‌ చేస్తున్నారు.

ఆర్టీసీ జేఏసీ నేతలు నిన్న సమ్మెను స్వచ్ఛందంగా విరమిస్తున్నట్టు ప్రకటించారు. ఆర్టీసీ భవితవ్యం, కార్మికుల శ్రేయస్సు దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి ప్రకటించారు. దీంతో 50 రోజులకుపైగా సాగిన సమ్మెకు ఫుల్‌స్టాప్ పడింది. షిఫ్టులతో సంబంధం లేకుండా ఉదయం ఆరు గంటలకే కార్మికులు విధులకు వెళ్లాలని సూచించారు. అయితే, కార్మికులు సమ్మె విరమించినా విధుల్లోకి తీసుకునే ప్రసక్తే లేదని ఆర్టీసీ తాత్కాలిక ఎండీ సునీల్ శర్మ స్పష్టమైన ప్రకటన చేశారు.

Related posts