telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పలేదు: మంత్రి అజయ్‌

puvvada ajay

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని టీఆర్‌ఎస్‌ ఎప్పుడు చెప్పలేదని తెలంగాణ రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ అన్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. ఆర్టీసీని ప్రైవేటీకరిస్తామని ప్రభుత్వం ఎప్పుడు చెప్పలేదని రాష్ట్ర ఆర్టీని కాపాడుకుంటామని సంస్థను ప్రైవేటుపరం చేయమని మంత్రి తెలిపారు. కాంగ్రెస్‌, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశాయా అని ప్రశ్నించారు.

రాష్ట్రంలో ఆందోళనలు చేస్తున్న బీజేపీ నేతలు, కేంద్రం చేస్తున్న పనులను గమనించటంలేదన్నారు. రైల్వేలో ప్రైవేటీకరణ విధానం బీజేపీ రాష్ట్ర నేతలకు కనిపించటం లేదా అన్నారు. ప్రభుత్వంపై విపక్షాలు అసంబద్ధ ఆరోపణలు చేస్తున్నాయన్నారు. కార్మిక సంఘాల నేతలు చర్చల నుంచి ఏకపక్షంగా వెళ్లిపోయారు. సమ్మెను ప్రయాణీకుల మీద, ప్రభుత్వం మీద బలవంతంగా రుద్దారన్నారు. ప్రయాణికుల సౌకర్యం నిమిత్తం ప్రభుత్వం 7358 వాహనాలను నడుపుతోందన్నారు. బస్సులను నడిపించేందుకు తాత్కాలిక సిబ్బందిని నియమిస్తామన్నారు. త్వరలోనే అన్ని బస్సులను పూర్తిస్థాయిలో నడుపుతామన్నారు.

Related posts