telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వ్యాపార వార్తలు

యాపిల్ సంస్థకు .. ట్రంప్ వార్నింగ్ … తమదేశంలోనే ..

trump warning to apple company

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక్కరిని కూడా వదలకుండా అందరిని కెలుక్కుంటున్నాడు. తాజాగా, యాపిల్ సంస్థ కు వార్నింగ్ ఇచ్చాడు. తన ఉత్పత్తులను తమ దేశంలోనే తయారు చేయాలని, లేని పక్షంలో విపరీతంగా టారిఫ్ లు విధిస్తామని హెచ్చరించారు. యాపిల్ తాజాగా తన అత్యాధునిక ‘ మ్యాక్ ప్రో ‘ డెస్క్ టాప్ కంప్యూటర్ ని తయారు చేసింది. కంపెనీ ఉత్పత్తుల్లోనే ఇది అత్యంత ఖరీదైనది.

తన ప్రొడక్టులను ఇక అమెరికా నుంచి చైనాకు షిఫ్ట్ చేయాలని యాపిల్ నిర్ణయించిన నేపథ్యంలో ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ మీరు చైనాకు ‘ వెళ్ళిపోతే ‘.. మీకు టారిఫ్ లో మాఫీ గానీ, ఇతర ప్రయోజనాలు గానీ ఉండబోవు ‘ అని ఆయన ట్వీట్ చేశాడు. యాపిల్ తన కొత్త కంప్యుటర్లోని కొన్ని విడిభాగాలను చైనాలో తయారు చేయించింది. కానీ ఇక ఈ ‘ ఆటలు సాగబోవని ‘, మీరు ఈ దేశంలోనే ఇందుకు పూనుకోవాలని ట్రంప్ ‘ ఆదేశించాడు ‘.

Related posts