kim trump meeting completed in singapore

వైట్ హౌస్ కు కిమ్

25
 ద్వైపాక్షిక సంబందలో భాగంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరియు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ సమావేశమయ్యారు.  అనంతరం ట్రంప్ మాట్లాడుతూ, ఇది   ఒక చారిత్రాత్మక సమావేశం అన్నారు. నిన్నటి ఉద్రిక్తత రేపటి యుద్ధానికి దారి తీయకూడదుఅన్నారు, వీలైనంత త్వరలో అణు నిరాయుధీకరణ జరుగుతుంది అని క్షిపణి ప్రయోగ కేంద్రాలను ధ్వంసం చేస్తామని కిమ్ హామీ ఇచ్చారన్నారు.
 
యుద్ధం ఎవరైనా చేయొచ్చు కానీ సాహనం  ఉన్నవాళ్లే శాంతి ప్రక్రియ చేపడతారు. ఉభయ కొరియాల ప్రజలు సామరస్యంగా జీవించాలి, కిమ్ తల్లి తండ్రులు నాకు మంచి స్నేహితులని ట్రంప్ అన్నారు. ఉత్తర కొరియాలో న్నా మా సైన్యాన్ని ఇప్పట్లో వెనక్కి పిలిపించడం సాధ్యం కాదు,  ఉత్తర కొరియాలో పూర్తి అణు నిరాయుధీకరణకు ఇద్దరం సంతకాలు చేసాం. నార్త్ కొరియాపై ఆంక్షలు కొనసాగుతాయి, నార్త్ కొరియా ఉజ్వల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కిమ్ చర్చలకు వచ్చారు. మేమిద్దరం మార్పు సాధ్యమని నిరూపించాం. వైట్ హౌస్ కు కిమ్ ను ఆహ్వానించాను అన్నారు ట్రంప్.