ట్రంప్ , కిమ్ సమావేశం మొదలైంది

27

ప్రపంచం మొత్తం ఎదురు చూస్తున్న చారిత్రాత్మక సమావేశం మొదలైంది .
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ , ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ సమావేశం సింగపూర్ లో సెంటో సాలో కాపెల్లా హోటల్లో కట్టుదిట్టమైన భద్రత నడుమ ప్రారంభమైంది. ప్రపంచంలోని అన్ని చానెల్స్ ఈ దృశ్యాలను కవర్ చేస్తున్నాయి . క్షణం క్షణం ఉత్కంఠ కలిగించే ఈ సమావేశం ప్రధానంగా అణు నిరాయుధీకరణపై సాగుతుంది .
ఇరు దేశాధినేతలు కలిసే సమావేశ మందిరానికి వచ్చారు . ఇద్దరు పరస్పరం షేక్ హ్యాండ్ ఇచ్చే దృశ్యాన్ని ఛానెల్స్ అధిక ప్రాధాన్య మిచ్చాయి .
ట్రంప్ , కిమ్ ఇద్దరు తమ తమ బృందాలతో సిద్ధమయ్యారు . వీరి భేటీకి అనువాదకులు కూడా వుంటారు .
చర్చలు ఫలప్రదమవుతాయన్న నమ్మకం ఉందని ట్రంప్ చెప్పారు . ప్రపంచంలో శాంతి నెలకొనడానికి తమ సమావేశం ఉపయోగపడుతుంది చెప్పారు .
ఇరు దేశాలు కలసి శాంతి చర్చలు జరపడం ఆనందంగా ఉందని కిమ్ తెలిపారు .
ప్రపంచ దేశాల నుంచి 2,500 మంది జర్నలిస్టులు ఈ చారిత్రాత్మక సమవేశం కవర్ చేస్తున్నారు