trump-kim-meeting-in-singapore

వీరిద్దరిలో ఎవరు తగ్గుతారు…?

97

ప్రపంచంలోనే ఏ దేశాన్నైనా వణికించే శక్తి సామర్ధ్యాలున్న అమెరికా కు సవాల్ విసిరిన కిమ్, అణుబాంబు కేంద్రంగా రెండు దేశాల మధ్య ఒక స్థాయిలో మాటల యుద్ధమే సాగింది. యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న తరుణంలో ఎవ్వరు ఊహించని విధంగా శాంతి సంకేతాలు పంపాడు కిమ్. కిమ్ సంకేతాలకు అంతే వేగంగా స్నేహ హస్తం ఇవ్వడానికి ముందుకు రావడంతో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. జూన్ 12వ తేదీన సింగపూర్ లో భేటీ కానున్న వీరిద్దరూ, పైకి బాగానే కనిపించినా, ఉద్రిక్తతలకు తెరపడినట్లే అని భావించడానికి వీల్లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కిమ్ అన్ని విధాలుగా సహకరిస్తే వైట్ హౌస్ కు ఆహ్వానిస్తానని, తేడా వస్తే సహించేది లేదని సమావేశం మధ్యలోనుంచే వచేస్తానని తెగేసి చెప్తున్నాడు.

trump kim meeting in Singapore

నార్త్ కొరియా అణ్వస్త్ర రహిత దేశంగా మారిపోవాలన్న సింగిల్ ఎజెండా తోనే ట్రంప్, కిమ్ తో భేటీ అవుతున్నారు. అదే సమయంలో ట్రంప్ ఆశిస్తున్న ప్రయోజనాలు మరిన్ని ఉన్నాయి. కిమ్ తో చర్చలు సఫలమైతే నార్త్ కొరియా భూభాగం మీద పట్టు సాధించవచ్చనే ఆలోచనలో అమెరికా వుంది. ఇప్పటికే అమెరికాకు చెందిన దాదాపు 30వేల మంది బలగాలు నార్త్ కొరియా బార్డర్ లో కాపు కాస్తున్నాయి. భేటీ సానుకూలంగా మారితే చైనా మీద మరింత నిఘా పెంచడానికి వీలవుతుంది. ఇదంతా జరగాలంటే కిమ్ దేశాన్ని అణ్వస్త్ర రహిత దేశంగా మారడానికి అంగీకరించాలి.

trump-kim-burger-in-singapore

నార్త్ కొరియాకు అణ్వస్త్ర దేశంగా గుర్తింపు కోసం తాపత్రేయ పడుతున్నాడు, ఈ విషయంలో ట్రంప్ నుంచి సరైన స్పందన రాకపోతే అమెరికా అధినేతకు మించిన మూర్కత్వన్ని ప్రదర్శించడానికి కిమ్ వెనకాడకపోవచ్చని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఆర్ధిక ఆంక్షల కోణంలో నార్త్ కొరియా ఈ భేటీ మీద చాలా ఆశలు పెట్టుకుంది. అదే సమయంలో అణుదేశంగా గుర్తింపు విషయంలో కిమ్ రాజీ పడే ప్రసక్తే లేదంటున్నాడు. వీరిద్దరిలో ఎవరు తగ్గుతారన్న అంశం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.

cocktail-drink-spl-for-usa-north korea
ఒకవైపు సమావేశం ఫలించకపోతే జరిగే పరిణామాలు ఎలా ఉంటాయో అనే ఆందోళన ఉండగా మరోవైపు వీరిద్దరి భేటీ ని దృష్టిలో పెట్టుకొని సింగపూర్ లోని హోటల్స్ సందడి చేస్తున్నాయి, అమెరికా చికెన్ కు కొరియన్ స్పైసి దట్టించి చేస్తున్న ట్రంప్ కిమ్ బర్గర్ ఫేమస్ అయిపోయింది. అలాగే ఒక పబ్ లో ఇరుదేశాల జెండాలు గుర్తుకొచ్చేలా కాక్ టైల్ డ్రింకును తయారు చేస్తున్నారు. ప్రజలు కూడా వీటిపై ఆసక్తి చూపిస్తున్నారు.

ఇప్పటివరకు అణ్వస్త్ర రహిత దేశంగా మారడానికి కిమ్ చాలా తగ్గాడు, ఇప్పుడు అదేవిధంగా ట్రంప్ తన పంతాన్ని తగ్గించుకుంటాడా లేక ఇద్దరు మళ్లీ పాత ధోరణిలోనే వ్యవహరిస్తారా అన్నది చర్చనీయాంశంగా మారింది.