telugu navyamedia
Uncategorized

సెనేట్ అంగీకరిస్తే న్యాయమూర్తిగా భారత సంతతి వ్యక్తి: ట్రంప్

trump usa

వాషింగ్టన్ డీసీలో ఉన్న అత్యున్నత న్యాయస్థానానికి భారత సంతతికి చెందిన వ్యక్తి న్యాయమూర్తి అవుతారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఈ విషయంలో సెనేట్ అంగీకరిస్తే భారత సంతతికి చెందిన విజయ్ శంకర్ కొలంబియా కోర్ట్ ఆఫ్ అపీల్స్ కు న్యాయమూర్తి అవుతారని ట్రంప్ తాజాగా వెల్లడించారు.

ప్రస్తుతం ఆయన క్రిమినల్ విభాగంలో సీనియర్ లిటిగేషన్ కౌన్సిల్ గానూ, అపిలేట్ సెక్షన్ లో డిప్యూటీ చీఫ్ గానూ విజయ్ శంకర్ విధులు నిర్వహిస్తున్నారు. 2012 నుంచి ఆయన అమెరికన్ న్యాయస్థానాల్లో విధుల్లో ఉన్నారు. అంతకుముందు విజయ్ శంకర్, వాషింగ్టన్ లో ప్రైవేట్ ప్రాక్టీస్ చేశారు. మేయర్ బ్రౌన్, ఎల్ఎల్సీ మరియు కన్వింగ్ టన్, బుర్లింగ్ ఎల్ఎల్పీల తరఫున వాదించారు. యూఎస్ కోర్ట్ ఆఫ్ అపీల్స్ న్యాయమూర్తి చెస్టర్ జే స్టౌబ్ వద్ద లా క్లర్క్ గా విధులు నిర్వహించారు.

Related posts