telugu navyamedia
తెలంగాణ వార్తలు

కేంద్రంపై పొరాటానికి కేసీఆర్ స‌మ‌ర‌శంఖం : పార్టీ ఎంపీలతో కేసీఆర్​ భేటీ.. ఆ అంశాలపై దిశానిర్దేశం

తెలంగాణ‌లో బీజేపీకి వ్యతిరేకంగా టీఆర్ఎస్ దేశవ్యాప్త ఉద్యమం లేవనెత్తనుంది.. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న అసంబద్ధ వైఖరిపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమర శంఖం పూరించనున్నారు. ఇందుకు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను వేదికగా చేసుకోనున్నారు. కేంద్ర ప్రభుత్వం అవినీతి పై పోరాటం చేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు.

ఈ క్ర‌మంలో టీఆర్ ఎస్‌ ఎంపీలతో సీఎం కేసీఆర్‌ సమావేశం కానున్నారు. ఈ నెల 18 నుంచి జరగనున్న పార్లమెంటు సమావేశాల దృష్ట్యా.. ఒంటిగంటకు ప్రగతిభవన్‌లో ఎంపీలతో సీఎం భేటీ కానున్నారు.

ఉభయసభల్లో టీఆర్ ఎస్ నేత‌లు అనుసరించాల్సిన విధివిధానాలపై దిశానిర్దేశం చేసేందుకు.. ఆ పార్టీ పార్లమెంట్ (రాజ్యసభ, లోక్ సభ) సభ్యులతో ముఖ్యమంత్రి సమావేశం అవుతారు.

లోక్​సభ, రాజ్యసభల్లో టీఆర్ ఎస్‌ ఎంపీలు అవలంభించాల్సిన పలు కీలక అంశాలపై సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడాలని ఎంపీలకు సూచించనున్నారు.

పార్లమెంటు వేదికగా తెలంగాణకు జరుగుతోన్న అన్యాయాలు, ధాన్యాన్ని కొనకుండా రైతులను, మిల్లర్లను, రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న తీరుపై పోరాడాలని ఎంపీలకు కేసీఆర్ పిలుపు ఇవ్వనున్నట్లు వెల్లడైంది

కాగా..బీజేపీపై పోరులో భాగంగా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, విపక్ష నేతలతో శుక్రవారం ఫోన్​లో మరోసారి సీఎం కేసీఆర్‌ మంతనాలు జరిపారు. పశ్చిమ బెంగాల్‌, ఢిల్లీ ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ, అరవింద్‌ కేజ్రీవాల్‌, బిహార్లోని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌, ఎస్పీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌, ఎన్సీపీ అధినేత శరద్‌ యాదవ్‌, ఇతర జాతీయ విపక్ష నేతలతోపలు అంశాలపై చర్చించారు. తమిళనాడు సీఎం స్టాలిన్‌ ఆస్పత్రిలో ఉన్నందున ఆయన సన్నిహితులతో మాట్లాడారు.

కేంద్రంపై పోరుకు కేసీఆర్‌ చేసిన ప్రతిపాదనలకు విపక్ష పాలిత రాష్ట్రాల సీఎంలు, విపక్ష నేతలు సానుకూలంగా స్పందిస్తున్నట్లు ప్రగతి భవన్‌ తాజాగా విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొన్నారు.ఈ నేపథ్యంలోనే ఎంపీలతో కానున్న సీఎం కేసీఆర్​ భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

 

 

Related posts