telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఎవరికీ ఇవ్వని గౌరవాన్ని కేసీఆర్ నాకు ఇచ్చారు: ఎమ్మెల్యే రాజయ్య

Tatikonda rajaiah mla

తన వ్యాఖ్యలను వక్రీకరించారే తప్ప తాను కేసీఆర్, కేటీఆర్ లకు వ్యతిరేకంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని టీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య వివరణ ఇచ్చారు. తెలంగాణ భవన్ లో మీడియాతో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో ఎవరికీ ఇవ్వని గౌరవాన్ని కేసీఆర్ తనకు ఇచ్చారని అన్నారు. డిప్యూటీ సీఎం పదవి పోయినా ప్రభుత్వంలో తనను అనేక రకాలుగా ప్రోత్సహించారని తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు తాను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశానని ఎమ్మెల్యే పదవిని సైతం వదులుకున్నానని గుర్తు చేశారు. గత ఎన్నికల్లో తనను ఓడించేందుకు కొందరు ప్రయత్నించారని, కానీ కేసీఆర్, కేటీఆర్ తనను ప్రోత్సహించి ఎమ్మెల్యేగా గెలిపించారని అన్నారు. తన స్థాయికి తగిన పదవిని ఇస్తానని తనకు కేసీఆర్ హామీ ఇచ్చారని తెలిపారు. జీవితాంతం తాను టీఆర్ఎస్ లోనే ఉంటానని రాజయ్య స్పష్టం చేశారు.

Related posts