telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ

తెలంగాణ ఎడిషన్‌లో ఆంధ్రా వార్తలు ఎందుకు?: కేటీఆర్

KTR Tribute to CRPF Jawans  Hyderabad
కొన్ని  మీడియా సంస్థలు  మేం ఏది చెప్తే అదే వేదం.. అంటూ ఇంకా కూడా తెలంగాణపై అధిపత్యాన్ని ప్రదర్శించే ధోరణిని అవలంబిస్తున్నారని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇప్పటికైనా అలాంటి అధిపత్య భావనలు పోతే మంచిందని కేటీఆర్ సూచించారు. జర్నలిస్టు, ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌ను తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆధ్వర్యంలో అభినందించారు. ఈ కార్యక్రమానికి కేటీఆర్ హాజరై ప్రసంగించారు. తెలంగాణ తన అస్థిత్వాన్ని చాటుకునే దిశగా పోరాటం చేసి రాష్ర్టాన్ని సాధించుకున్నాం. ఈ క్రమంలో ఇక్కడ పొద్దున్నే లేవగానే అమరావతి వార్తలు కనిపిస్తాయి. 
అమరావతి వార్తలు వేయండి తమకు ఎలాంటి సమస్య లేదు. కానీ అమరావతిలో కూడా తెలంగాణ వార్తలు వేయాలనే సంస్కారం ఉండాలి? కదా అని ప్రశ్నించారు. తాను ఢిల్లీకి వెళ్లినప్పుడు  అక్కడ కొన్ని పత్రికలు చూస్తే మన న వార్తలు ఉండనే ఉండవని కేటీఆర్ తెలిపారు. తెలంగాణలో ఒక ప్రభుత్వం ఉన్నట్లుగానీ, ఒక ముఖ్యమంత్రి ఉన్నట్లు గానీ వార్తలు కనబడవు. ఆ సందర్భంగా తాను  ఏం మేం ఈ దేశంలో లేమా అని అక్కడున్న వ్యక్తిని అడిగితే .. సార్ అది ఆంధ్రా ఎడిషన్ అని చెప్పిండు. మరి ఆంధ్రా ఎడిషన్‌లో తెలంగాణ వార్తలు రాయనప్పుడు, తెలంగాణ ఎడిషన్‌లో ఆంధ్రా వార్తలు ఎందుకు? అని కేటీఆర్ ప్రశ్నించారు. 
ఇప్పటికైనా అలాంటి అధిపత్య భావనలు పోతే మంచిందని కేటీఆర్ సూచించారు. తాము ఎలాంటి వివాదం కోరుకోవడం లేదు. ఎవరూ కూడా అధిపత్యం చలాయించాలని కోరుకోవడం లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. దీనిపై జర్నలిస్టులు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ విషయంపై ముఖ్యమంత్రి మాట్లాడితే కొందరికి కోపం వస్తది. కావునా తెలంగాణ భావజాలాన్ని అణువణువునా నింపుకున్న తెలంగాణ పత్రికలను ప్రభుత్వం ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు.

Related posts