telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచింది: హరీష్ రావు

Ryathu bandhu amount Rs. 10000 in future

తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌ రావు అన్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెల్లాపూర్‌ మున్సిపాలిటీ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మెదక్‌ ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌ రెడ్డి, ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్‌ రావు మాట్లాడుతూ..పేదల పేరు చెప్పి ఓట్లు దండుకోవడమే కాంగ్రెస్‌ నేతల పని అని అన్నారు.

1971లో ఇందిరాగాంధీ గరీబీ హఠావో అంటే రాహుల్‌ గాంధీ కూడా ఇప్పటికీ అదే మాట చెబుతున్నాడన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 72 ఏండ్లు అయినా పేదలు ఇంకా పేదలుగా ఎందుకున్నారో రాహుల్‌ సమాధానం చెప్పాలని హరీష్ డిమాండ్ చేశారు. వృద్ధులు, వితంతువులను సీఎం కేసీఆర్‌ పెద్ద కొడుకులా చూసుకుంటున్నారు. 57 ఏండ్లు నిండిన వారందరికీ రూ. 2016 పెన్షన్‌ ఇస్తామన్నారు. నిరుద్యోగులకు రూ. 3 వేల భృతి ఇస్తాం. పేదలందరికీ డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు కట్టించి ఇస్తామని హరీష్‌ రావు హామీ ఇచ్చారు.

Related posts