road-accident

ఆధ్యాత్మిక యాత్ర విషాద యాత్రగా మిగిలింది

24

విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భోగాపురం మండలం పోలిపల్లి వద్ద ఓ టూరిస్టు బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో లారీ, ట్రావెల్స్ బస్సు నుజ్జునుజ్జు అయ్యాయి. దీంతో క్షతగాత్రులు బస్సు శిథిలాల్లోనే చిక్కుకొని ఆర్తనాదాలు చేశారు. వారిని అతి కష్టం మీద బయటకు తీసి, స్థానిక ఆసుపత్రికి తరలించారు. స్థానిక ఆసుపత్రి వైద్యులుక్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారు. గాయపడ్డ వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది.

road-accident-1

కాశి నుంచి తిరిగొస్తుండగా పోలేపల్లి దగ్గర ఈ ఘటన జరిగింది. క్షతగాత్రులు విజయనగరం, తగరపువలస, విశాఖ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఆధ్యాత్మిక యాత్ర విషాద యాత్రగా మిగిలిందంటూ కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు.